మన్యం బంద్‌తో ఏజెన్సీలో టెన్షన్

AP: అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఆదివాసీ సంఘాలు చేపట్టిన మన్యం బంద్ కొనసాగుతోంది. జీవో నంబర్ 3ను పునరుద్ధరించడంతోపాటు స్థానిక గిరిజనులకు 100శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. 1/70 చట్టాన్ని పక్కాగా అమలుచేసి, భూబదలాయింపులను అడ్డుకోవాలని కోరారు. పాడేరులో ఆదివాసీ సంఘాల నేతలు RTC కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై బైఠాయించి బస్సులు, వాహనాలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. రంపచోడవరం సహా పలు ఏజెన్సీ ప్రాంతాల్లో దుకాణాలు మూతపడ్డాయి.




