ఆ హాస్పిటల్‌కు ప్రొ. జయశంకర్ పేరు.. విజ్ఞప్తి చేసిన మంత్రి

TG: సనత్‌నగర్ TIMS హాస్పిటల్‌కు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన.. నిర్మాణంలో ఉన్న అల్వాల్ TIMSకు మాజీ సీఎం టి.అంజయ్య పేరు పెట్టాలని కోరారు. అలాగే ఎల్‌బీనగర్ TIMSకు కొండా లక్ష్మణ్ బాపూజీ, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ప్రొఫెసర్ జయశంకర్ పేర్లు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.



