పిల్లల డ్రెస్‌లపై ఆ డిజైన్ ఉంటే వెంటనే మార్చండి..
చిన్న పిల్లల టీషర్టులపై ఉన్న డెకాల్ డిజైన్లు, సున్నితమైన ప్రాంతాల్లో ఇతరులు తాకేలా ప్రేరేపిస్తున్నాయని క్యాట్ అనే మహిళ instagram వీడియోలో ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ఆ షాప్ ఆ దుస్తులను నిలిపివేసి, క్లియరెన్స్ సేల్‌లో పెట్టింది. వాటి వల్ల ఎవరికీ రిస్క్ రాకూడదనుకున్న ఆమె, ఆ 25 షర్టులను తనే 13వేల 800 రూపాయలతో కొనేసింది. వాటిపై ఉన్న డిజైన్లను తొలగించి, అవసరమైన పిల్లలకు డొనేట్ చేయనున్నట్లు చెప్పగా, నెటిజన్లు ఆమె రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.

