మనిషి ఎప్పుడు నిజంగా “పెద్దవాడు” అవుతాడు?

వయసు పెరిగితేనే పెద్దవాళ్లం అవ్వం.. మన ఆలోచనలు, మన ప్రవర్తన మారినప్పుడే పెద్దవాళ్లమవుతాం. కోపం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ కాకుండా ఆలోచించడం, తప్పు జరిగితే ఒప్పుకోవడం, మన నిర్ణయాలకు మనమే బాధ్యత తీసుకోవడం, నచ్చని విషయాలకు అవసరమైతే ‘నో’ చెప్పడం.. ఇవన్నీ మెచ్యూరిటీకి సంకేతాలు. సైకాలజీ ప్రకారం పెద్దవాడవడం ఒక్క రోజులో జరిగే మార్పు కాదు, ఎమోషన్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, బాధ్యత వంటి స్కిల్స్ కాలంతో పాటు డెవలప్ అవుతాయి. వయసు మనల్ని పెద్దవాళ్లను చేయదు.. మన ఆలోచనలు, ప్రవర్తన, బాధ్యతలే చేస్తాయి!
