విమాన ప్రమాదం.. 14 మంది మృతి
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శుక్రవారం విమాన ప్రమాదం జరిగి 14 మంది మృతి చెందారు. కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసా వైపు వెళ్తున్న ట్రేసెప్ లెట్ ఎల్-410 విమానం టెక్నికల్ ఫాల్ట్ కారణంగా కెంగే ప్రాంతంలో కూలిపోయింది. మృతుల్లో ఆర్మీ కోర్టు హెడ్ లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా సహా 12 మంది ప్రతినిధి బృంద సభ్యులు, క్రూవ్ సభ్యులు ఉన్నారు. అందరూ మరణించగా, ప్రమాద కారణాలపై విచారణ ప్రారంభమైంది.



