పారిస్ ముస్లిం సిటీ?: Trump

డొనాల్డ్ ట్రంప్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో జరిగే ప్రొటెస్టులు హింసగా మారడానికి కారణం ఇమ్మిగ్రేషనే అన్నారు. “ఇది స్కూళ్ల వల్ల కాదు, ఇమ్మిగ్రేషన్ వల్లే. 'ప్రపంచం నుంచి అందరినీ రానివ్వకు' అని ప్రెసిడెంట్ మాక్రాన్‌తో ఎప్పుడో చెప్పాను" అని ట్రంప్ అన్నారు. “పారిస్ త్వరలోనే ముస్లిం సిటీ అవుతుంది, బోర్డర్లు మూసి, నేరస్థుల్ని తొలగించాలి” అని హెచ్చరించారు. “మైగ్రెంట్లు ఫ్రాన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు” అని ట్రూత్ సోషల్‌లో రాశారు.



