మూసీ పనుల్లో వేగం పెంచాలి: రేవంత్ రెడ్డి

TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు రెండోదశ పనులను వేగంగా ప్రారంభించేందుకు CM రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ ప్రాజెక్టుపై CM సమీక్ష నిర్వహించారు. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు అధికంగా ఉన్నందున అక్కడ అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని సూచించారు. అవసరమైన భూమిని గుర్తించేందుకు జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించాలని, HMDA విధానంలో భూసమీకరణ చేపట్టాలని ఆదేశించారు. FTL, బఫర్‌జోన్, అసైన్డ్ భూముల విషయంలో చట్టపరమైన సమస్యలు రాకుండా స్పష్టమైన విధానం రూపొందించాలన్నారు.



