ఆంధ్రా గోవాకు కొత్త రూపు

AP: సూర్యలంక బీచ్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా అభివృద్ధి చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తూర్పు తీర ఆంధ్రా గోవాగా పేరున్న ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే స్వదేశీ దర్శన్ పథకం కింద రూ.97.52 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. బీచ్ నుంచి చీరాల వరకు 18 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని బీచ్ కారిడార్‌గా అభివృద్ధి చేసి, ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.



