← Back to news

‘రణబాలి’ షూట్ కంప్లీట్.. రష్మిక లుక్ వైరల్!

By Anusha· 1h ago

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా ‘రణబాలి’ షూటింగ్ పూర్తయింది. రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక ‘జయమ్మ’ పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా టీమ్ విడుదల చేసిన వీడియోలో బేబీ బంప్‌తో కనిపించిన రష్మిక లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాత్రపై రాహుల్ సాంకృత్యాన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తల్లి పేరు ‘జయమ్మ’నే హీరోయిన్ పాత్రకు పెట్టానని, నేటితరం మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు తెలిపారు.

More in Entertainment