జడ్పీటీసీ పోటీ బాధ్యత కన్నబాబుకు!

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల జడ్పీటీసీ అభ్యర్థి ఎంపిక బాధ్యతలను కన్నబాబుకు అప్పగించారు. ఆయన కృష్ణుని పాలెం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు, TDP రాష్ట్ర కార్యదర్శి. గత ఎన్నికల్లో పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి ఈ బాధ్యత కేటాయించినట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. గత ఎన్నికల్లో YCPకి దీటుగా పోటీ చేసి TDPకి అండగా నిలిచిన కన్నబాబు కృషి చేశారని, ఆయన సేవలు గోకవరం మండల అభివృద్ధికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.



