← Back to news

పెద్దిలో రాం చరణ్ గాయంపై చిరు ఎమోషనల్

By DS· 25 Jun 2026· Hyderabad
పెద్దిలో రాం చరణ్ గాయంపై చిరు ఎమోషనల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సెట్స్‌పై ఫైట్ సీక్వెన్స్ చేస్తూ కంటికి గాయం చేసుకున్న రోజంతా మెగాస్టార్ చిరంజీవి నరకం చూశారట! షూటింగ్ స్పాట్ నుండి వచ్చిన ఆ ఒక్క ఫోన్ కాల్ మెగా ఫ్యామిలీని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. "నాకు ఆ ఫోటో చూడగానే గుండె ఆగినంత పనైంది. చరణ్ కంటి చూపుకు ఏం కాలేదని డాక్టర్లు చెప్పే వరకు ఊపిరి పీల్చుకోలేదు" అని చిరు నాటి భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు. తన కెరీర్ ఆరంభంలో ‘గూండా’ సినిమా కోసం ఇలాగే ప్రాణాలకు తెగించి డూప్ లేకుండా హై-రిస్క్ స్టంట్స్ చేసిన రోజులను ఈ సందర్భంగా చిరంజీవి గుర్తుచేసుకున్నారు. చరణ్ డెడికేషన్‌ను చూసి గర్వపడు తున్నానన్నారు.

More in Politics