← Back to news

ప్రభుత్వం నుంచి సాయం అందేలా చేస్తా: తహసీల్దార్

By DK· 1h ago
ప్రభుత్వం నుంచి సాయం అందేలా చేస్తా: తహసీల్దార్

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం కరసాలుగూడలో భారీ వర్షాలకు పూజారి గోపికి చెందిన ఇల్లు పూర్తిగా కూలిపోయింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీధర్ రాజు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి ఇల్లు కూలిన వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పాడుబడ్డ ఇళ్లలో ఎవరూ ఉండకూడదని సూచించారు.

More in Politics