← Back to news

స్వాతంత్య్ర దినోత్సవ వేళ గిరిజనుల నిరసన..

By Mahesh· 15 Aug 2026

AP: స్వాతంత్య్ర దినోత్సవ వేళ అనకాపల్లి జిల్లా గిరిజనులు నిరసన ర్యాలీ చేపట్టారు. రావికమతం, వి.మాడుగుల మండలాల పరిధిలోని సమలమ్మ కొండపై ఉంటున్న 22 గిరిజన కుటుంబాలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నేషనల్ ఫ్లాగ్స్‌తో గుర్రాలపై మూడు కి.మీ. ర్యాలీ చేశారు. ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్‌తో పాటు కనీస వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. “ఏ సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నాం.. మమ్మల్ని కనీసం మనుషులుగా గుర్తించండి” అంటూ నినాదాలు చేశారు.

More in AP