← Back to news

కొందరి వల్ల పార్టీకి చెడు పేరు: అక్బరుద్దీన్ ఒవైసీ

By Vishi· 9 Oct 2026
కొందరి వల్ల పార్టీకి చెడు పేరు: అక్బరుద్దీన్ ఒవైసీ

మజ్లిస్(AIMIM) పార్టీపై, పార్టీ నాయకులపై వస్తున్న విమర్శలపై MIM శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. పార్టీకి చెందిన కొందరు నాయకుల వల్ల చెడు పేరు వస్తోందని అన్నారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా, తమ ప్రజలకు కావలసిన పనులు ఎలా చేయించుకోవాలో మజ్లిస్‌కు బాగా తెలుసని స్పష్టం చేశారు. తమ లక్ష్యం పాతబస్తీ అభివృద్ధి, మైనారిటీల హక్కుల పరిరక్షణ అని తెలిపారు. ప్రజల్లో అసంతృప్తి పెంచడానికి ప్రయత్నించేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

More in TG