చేపలు, మాంసం తింటాం..మీకెందుకు?: BJP చీఫ్

దుర్గాపూజ సమయంలో బెంగాలీలు నాన్‌వెజ్ తినొద్దన్న బాగేశ్వర్ బాబా కామెంట్స్‌పై రాష్ట్ర BJP చీఫ్ సమిక్ భట్టాచార్య రియాక్ట్ అయ్యారు. బెంగాలీల ఫుడ్ అలవాట్లను బయట నుంచి ఎవరూ నిర్ణయించలేరని ఆయన చెప్పారు. అష్టమి రోజు లూచీ, నవమి రోజు మటన్ తినడం బెంగాలీ సంప్రదాయమని అన్నారు. ఎవరికి నచ్చిన ఆహారం వాళ్లు తినొచ్చని, దీనిపై ఎలాంటి రాజకీయ ఆదేశాలు ఉండకూడదన్నారు. దుర్గాపూజలో నాన్‌వెజ్, మద్యం అమ్మకాలను నిలిపివేయాలని బాగేశ్వర్ బాబా కోరారు.



