22A వివాదం వెనుక అసలు కథ!

రిజిస్ట్రేషన్ చట్టం(1908)లోని సెక్షన్ 22A ప్రకారం కొన్ని ప్రత్యేక భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉంటుంది. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు ఈ 22A నిషేధిత జాబితాలోకి వస్తాయి. ఈ కేటగిరీలోని భూములను ప్రైవేట్ వ్యక్తులు అమ్మడం, కొనడం లేదా రిజిస్టర్ చేయడం చట్టరీత్యా చెల్లదు. ప్రస్తుతం ఈ తరహా నిషేధిత భూముల పరిధిలో అక్రమ రిజిస్ట్రేషన్లు, భూదందాలు జరిగాయన్న ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.


