బైక్ ట్యాక్సీలకు ఎల్లో ప్లేట్.. రైడర్లకు షాక్?

TG: రాష్ట్రంలో Rapido, Uber, Ola బైక్ ట్యాక్సీలకు ఎల్లో నంబర్ ప్లేట్ కంపల్సరీ చేసేలా ప్రభుత్వం త్వరలో డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎల్లో ప్లేట్ కోసం రూ.3 వేల కన్వర్షన్ ఛార్జీతో పాటు కమర్షియల్ రోడ్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్, ఫిట్‌నెస్, గ్రీన్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు కూడా పే చేయాల్సి ఉంటుంది. దీంతో 18 వేలకు పైగా బైక్ ట్యాక్సీలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అవి తగ్గితే క్యాబ్, ఆటో ఛార్జీలు పెరిగే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది.



