రెడ్ క్రాస్ దాతలకు తహసీల్దార్ ధన్యవాదాలు

బాపట్ల జిల్లాలో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను గుర్తించి విరాళాలందించిన దాతలకు తహసీల్దార్ డీ. రవీంద్ర కుమార్ ధన్యవాదాలు తెలిపారు. యారం చిన్నబ్బాయి ₹10,000, దొప్పలపూడి చిన్న శ్రీనివాసరావు ₹5,000 విరాళంగా అందించగా దాతలను అభినందించారు. ఛైర్మన్ ఇనకొల్లు పోలీసురావు మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కోరారు.



