← Back to news

ఎన్నికల వేళ అప్రమత్తమైన పోలీసులు

By Bala· 1h ago
ఎన్నికల వేళ అప్రమత్తమైన పోలీసులు

కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కవాతు నిర్వహించారు. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సీఐ బి. సూర్య అప్పారావు, ఎస్సై రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో వజ్ర వాహనాలతో ప్రధాన వీధుల్లో కవాతు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

More in Local