తాండూరు మున్సిపాలిటీలో విజయదశమి వేడుకలు

వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిన్న విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి జేసీబీ, ఆటోలు, ఇతర యంత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని పేర్కొంటూ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సహకారంతో తాండూరు అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



