స్వాతంత్ర్య వేడుకల్లో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు

TG: పరకాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అమరధామంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరైనప్పటికీ కార్యక్రమం ప్రారంభ సమయంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.



