← Back to news

ఊరికి వెళ్తూ.. అన్నాచెల్లెలు మృతి

By Krishna· 1d ago
ఊరికి వెళ్తూ.. అన్నాచెల్లెలు మృతి

హైదరాబాద్.. హయత్‌నగర్‌‌లో విషాదం జరిగింది. విజయవాడ హైవేలో స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెలిని.. మహీంద్రా థార్ కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్, రేఖ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. పెద్ద అంబర్‌పేటకు చెందిన వీరు.. చెల్లెలి నాలుగేళ్ల కూతురితో కలిసి పండుగ సందర్భంగా సొంతూరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

More in TG