రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలి: ప్రశాంత్ కిశోర్

ప్రభుత్వాన్ని, వ్యవస్థను నిలదీసేందుకు ప్రతి ఆరు నెలలకో లేదా ఏడాదినో ప్రజలకు అద్భుతమైన అవకాశాలు వస్తాయని జన సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. పాట్నా జిల్లాలోని బఢ్ ప్రాంతంలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయాల్లో వేసే ఓట్లు ప్రభుత్వాన్ని మార్చలేకపోయినా, అధికారంలో ఉన్నవారిలో మాత్రం బలమైన భయాన్ని సృష్టిస్తాయని అన్నారు. ఐదు కిలోల ఉచిత బియ్యం ఆశ చూపి లొంగదీసుకునే రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలని ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు.


