← Back to news

అవినీతి, అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం: అడ్లూరి

By Srikanth Goud· 1d ago· Jagitial

TG: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవినీతి, అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సవాల్‌ విసిరారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ పంపిస్తానన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో రూ.141 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

More in TG