నీళ్ల కోసం అమ్మకానికి గ్రామం!

మహారాష్ట్ర సొలాపూర్ జిల్లా మాఢా తాలూకాలోని తుల్షి గ్రామం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 25 ఏళ్లుగా సాగునీటి కోసం పోరాడుతున్న గ్రామస్థులు.. నిరసనగా ‘గ్రామాన్ని అమ్మేస్తున్నాం’ అంటూ పోస్టర్లు పెట్టారు. గ్రామానికి 9 కిలోమీటర్ల దూరంలో సీనా-మాఢా ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఉన్నా నీరు అందడం లేదని ఆరోపించారు. 45 రోజులుగా వర్షాలు లేక నీటి వనరులు ఎండిపోవడంతో వినాయక చవితికి దీక్షకు దిగారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఎలక్షన్స్ బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించారు. మంత్రి రాధాకృష్ణ పాటిల్ చర్చలతో ఆందోళన విరమించారు.



