ఉప సర్పంచ్‌లకు కొత్త రూల్

గ్రామ పంచాయతీ నిధుల చెల్లింపుల్లో ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌పై పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. సర్పంచ్ లేదా కార్యదర్శి చెక్ సమర్పించిన 7 వర్కింగ్ డేస్‌లో ఉప సర్పంచ్ కచ్చితంగా సైన్ చేయాల్సిందే. సరైన కారణం లేకుండా సంతకం చేయకుండా ఆపితే కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. పారిశుధ్యం, తాగునీరు వంటి అభివృద్ధి పనుల బిల్లులు ఆగిపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

