← Back to news

బతుకమ్మ వేడుకల్లో విషాదం.. మహిళ మృతి

By K. VENKATESH· 23h ago· Khammam
బతుకమ్మ వేడుకల్లో విషాదం.. మహిళ మృతి

ఖమ్మం జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న యలగాల భారతి (50) నృత్యం (డ్యాన్స్) చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందారు.అప్పల నరసింహపురం గ్రామానికి చెందిన ఆమె బంధువుల ఇంటికి వచ్చారు. వేడుకల్లో భాగంగా డీజే వద్ద నృత్యం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

More in Local