ఆగస్టు 15 నుండి హాకీ వరల్డ్ కప్!

మహిళల హాకీ వరల్డ్ కప్ 2026 కోసం 20 మందితో కూడిన ఇండియన్ టీమ్‌ను హాకీ ఇండియా అనౌన్స్ చేసింది. ఈ మెగా టోర్నీకి సలీమా టెటే కెప్టెన్‌గా సెలెక్ట్ అయింది. నెదర్లాండ్స్, బెల్జియం దేశాలు కలిసి హోస్ట్ చేస్తున్న ఈ టోర్నమెంట్ ఆగస్టు 15 నుండి 30 వరకు జరగనుంది. పూల్-డి గ్రూప్‌లో ఉన్న ఇండియా.. చైనా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికాలతో మ్యాచ్‌లు ఆడనుంది. రీసెంట్‌గా నేషన్స్ కప్ గెలిచిన ప్లేయర్స్‌కే ఈ టీమ్‌లో ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం బెంగళూరు క్యాంప్‌లో ఇండియా టీమ్ ఫుల్ ప్రాక్టీస్ చేస్తోంది.



