← Back to news

సర్కార్ పనితీరు ఎలా ఉంది?

By A.Ajay· 1h ago
సర్కార్ పనితీరు ఎలా ఉంది?

TG: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనితీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్‌ సాయంతో క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతోంది. ఇందులో ప్రభుత్వం, CM రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలను ప్రశ్నిస్తున్నారు. ఏ పథకం నచ్చింది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారు? కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే కారణమేంటి? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ వార్డులు, కార్పొరేషన్‌ డివిజన్లలో నెలరోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం.

More in TG