909 మంది ఓటర్లకు.. లిస్ట్‌లో ఒక్కరే!
చాందినీ చౌక్ బెలా ఎస్టేట్‌లో SIR జాబితాపై చర్చ. గతంలో 909 మంది ఓటర్లు ఉండగా, డ్రాఫ్ట్‌లో ఒకరి పేరు మాత్రమే ఉందని సౌరవ్ దాస్ తెలిపారు. 2022-23లో కూల్చివేతల తర్వాత చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని చెబుతూ పేర్లు తొలగించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 13 కోట్లకుపైగా పేర్లు తొలగించారని చెప్పారు. చనిపోయినవారు, తరలిపోయినవారు, డూప్లికేట్ పేర్లను తొలగించేందుకే SIR అని EC తెలిపింది. పేరు లేకపోతే ఫైనల్ లిస్ట్‌కు ముందు క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొంది.

