← Back to news

రష్యా ఆయిల్ ఫెసిలిటీలపై ఉక్రెయిన్ అటాక్

By Lokesh· 9h ago· X

రష్యా దాడులకు తిరిగి ఉక్రెయిన్‌ సైన్యం మెయిన్ టార్గెట్లపై దాడులు చేసినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. గత 24 గంటల్లో రష్యా యుద్ధానికి ఆర్థికంగా, సైనికంగా సహకరిస్తున్న నాలుగు టార్గెట్లను తమ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు. పెర్మ్, సమారా, ఆస్ట్రాఖాన్ ప్రాంతాల్లోని రెండు ఆయిల్ ఫెసిలిటీస్‌తో పాటు ఓ ట్రైనింగ్ గ్రౌండ్‌పై దాడులు జరిగినట్లు తెలిపారు. బ్లాక్ సీలో కూడా ఉక్రెయిన్‌ ప్రతిదాడి చేసినట్లు తెలిపారు.

More in International