ఐబొమ్మ రవికి కోర్టులో రిలీఫ్.. కానీ!

TG: ఐబొమ్మ ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో కాస్త రిలీఫ్ దొరికింది. పోలీసులు సీజ్ చేసిన ఆయన బ్యాంక్ అకౌంట్లలో ట్రాన్సాక్షన్స్ చేసుకునేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇందుకు రవికి అవకాశం కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అకౌంట్లలో ఫ్రీజ్ చేసిన 3 కోట్ల రూపాయలను అన్‌ఫ్రీజ్ చేసి వాడుకునేందుకు మాత్రం కోర్టు నో చెప్పింది. ఫ్యామిలీని మెయింటైన్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రవి 8 రోజుల క్రితం పిటిషన్ వేశారు. 3 కోట్ల రూపాయలను వాడుకునేలా అనుమతి కోరినా.. ఆ రిక్వెస్ట్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది.



