తెలంగాణలో BRS శకం ముగిసింది: TPCC ఛీప్

తెలంగాణలో BRS శకం ముగిసిందని.. వంద సీట్లతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ లంబాడీలకు ST రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్న 'ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర'ను ఆయన HYD గాంధీభవన్‌లో జెండాఊపి ప్రారంభించారు. పేదల గుండెల్లో ఇందిరాగాంధీ చిరస్మరణీయంగా నిలిచిపోయారని, SC, ST, BC, మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుందని పేర్కొన్నారు.


