స్థిరంగా బంగారం ధరలు!

అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశంలో గోల్డ్ రేట్ల స్పీడుకి చెక్ పడింది. గత రెండు సెషన్లుగా మార్కెట్‌లో చెప్పుకోదగ్గ మార్పులు లేకపోవడంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,220 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 1,32,190 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ. 1,08,150గా నమోదైంది. గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్‌తో గోల్డ్ రేట్లు పెరగకుండా ఉండటంతో బంగారం కొనేవారికి కాస్త రిలీఫ్ లభించింది.



