ఉద్యోగం చేస్తూనే.. చదువుకునే అవకాశం

AP: ఉద్యోగాలు చేస్తూనే పైచదువులు చదవాలనుకునేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. AICTE నిబంధనల ప్రకారం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం అడ్మిషన్లను ప్రవేశపెట్టింది. ఉద్యోగులు వారు పనిచేసే చోటి నుంచి 50 కి.మీలలోపు ఉండే కాలేజీల్లో B.Tech, B.E, M.E, M.Tech, MBA, MCA, కోర్సులు చదువుకోవచ్చు. ఈ కోర్సులకు అప్లై చేసుకునేవాళ్లకు కనీసం ఒక ఏడాది ఉద్యోగ అనుభవం తప్పనిసరి. UGలో 60, PGలో 30 సీట్లు ఉంటాయి. ఈ ప్రత్యేక అడ్మిషన్లు 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.



