వన్నివేలంపట్టి: ఆ ఊరంతా కమ్యూనిస్టులే!

తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా పెరైయూర్ తాలూకాలోని వన్నివేలంపట్టి అనే గ్రామం ‘ఎర్ర ఊరు’గా పేరు పొందింది. ఇక్కడ లెనిన్, ఏంగెల్స్, మార్క్సియా, లెనినా, కాస్ట్రో పేర్లున్న మనుషులు ఇక్కడ ఉంటారు. ఈ గ్రామంలో కమ్యూనిజం రాజకీయం మాత్రమే కాదు, జీవన విధానంగా మారిపోయింది. పిల్లలకు కమ్యూనిస్ట్ నాయకుల పేర్లు పెట్టే సంప్రదాయం కొనసాగుతోంది. గ్రామంలో ‘నమక్కు నామే’ (మాకు మేమే) అనే సూత్రంతో సొంతంగా నీటి ట్యాంక్, వంతెన, స్మశానం దారి లాంటివి నిర్మించుకున్నారు.



