← Back to news

మారిన నేరాలకు తగ్గట్టుగా భారీ మార్పులు: DGP

By DK· 20 Aug 2026· హైదరాబాద్
మారిన నేరాలకు తగ్గట్టుగా భారీ మార్పులు: DGP

TG: మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీస్ శాఖలో కీలక మార్పులు చేపడుతున్నట్లు DGP CV ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గతంలో తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా, ఇప్పుడు డ్రగ్స్, సైబర్‌నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, ట్రాఫిక్, ఆహార కల్తీ, రోడ్డు ప్రమాదాలు కొత్త సమస్యలుగా మారాయని తెలిపారు. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐఐబీ వంటి విభాగాల నుంచి 513మంది సిబ్బందిని 8విభాగాలకు కేటాయించినట్లు చెప్పారు.

More in TG