ICUలో ఏసీలు బంద్.. రోగులకు నరకయాతన

TG: ప్రాణాలు కాపాడాల్సిన ICUలోనే ఏసీలు పనిచేయకపోవడంతో రోగులు ఉక్కపోతతో అల్లాడుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరిస్థితి నెలకొంది. అత్యవసర చికిత్స పొందుతున్న రోగులకు అనుకూలమైన వాతావరణం ఎంతో అవసరమైనప్పటికీ, ICUలో ఏసీలు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బంధువులు తెలిపారు. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, ఐసీయూ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అధికారులను కోరారు.



