← Back to news

తెలంగాణ సంప్రదాయాల వైభవమే బతుకమ్మ: ఎమ్మెల్యే

By prabhakar kodepaka· 1h ago· Hanumakonda
తెలంగాణ సంప్రదాయాల వైభవమే బతుకమ్మ: ఎమ్మెల్యే

హనుమకొండ జిల్లా పరకాల అంగడి మైదానంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఆత్మకూరు, గుడెప్పాడ్ గ్రామాల్లో వేడుకల్లో పాల్గొన్నారు. దామర చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, మహిళల ఆత్మగౌరవాన్ని చాటుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ సంప్రదాయాల వైభవమే బతుకమ్మ: ఎమ్మెల్యే

More in Local