KBR చుట్టూ ఇక ఎలా వెళ్లాలి? పోలీసుల కొత్త ప్లాన్!
TG: హైదరాబాద్‌లోని KBR పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. H-CITI ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా రూ.1,090 కోట్లతో రెండు ప్యాకేజీల్లో నిర్మిస్తున్నారు. రెండేళ్ల ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ పనులు జరగనున్నాయి. దీంతో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వన్‌వే సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. పార్క్ చుట్టూ 13 లేన్ చేంజర్లు, 10 ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వాహనదారులు సైన్‌బోర్డులను గమనిస్తూ లేన్ మార్చుకోవచ్చు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగానికి పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.



