ప్రజాస్వామ్య హక్కులను కాలరాయొద్దు: పొన్నం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ MLA, మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం, నిరసనలను అణచివేయడం సరికాదని అన్నారు. నిరసనకారులను జంతర్ మంతర్ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని, దానిని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగింపు ఆరోపణలపై కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.



