చెత్త ఇస్తే సరుకులు ఇస్తారా ?

AP : తిరుపతి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ‘స్వచ్ఛ రథాలు’ సూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ బండ్ల ద్వారా ఏకంగా 5.5 లక్షల కిలోల పొడి చెత్తను సేకరించినట్లు జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి చెప్పారు. ప్రజలు తమ ఇళ్లలోని పాత ప్లాస్టిక్, కాగితాలు, కార్డ్‌బోర్డ్ డబ్బాలంటి పొడి చెత్తను ఈ స్వచ్ఛ రథాలకు ఇచ్చి, వాటికి బదులుగా ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులను పొందవచ్చని తెలిపారు. దీనికి ఎలాంటి లిమిట్ లేదు, ఎంత ఎక్కువ చెత్త ఇస్తే అంత ఎక్కువ సరుకులు ఇస్తారని అన్నారు.

