← Back to news

గాంధీలో మరో ఎబోలా కేసు ..!

By aravinda nyayapati· 5 Jun 2026
గాంధీలో మరో ఎబోలా కేసు ..!

సూడాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన మరో వ్యక్తి మహమ్మద్ యగౌచ్ కి ఎబోలా వైరస్ సోకినట్టుగా అనుమానం రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించి ఐసలేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. నిన్న కూడా సూడాన్ నుంచి వచ్చిన అహ్మద్ అనే వ్యక్తికే ఎబోలా లక్షణాలున్నట్టు గుర్తించారు. వీరి శాంపిల్స్ పుణెకి పంపారు. వారం రోజుల్లో నివేదిక వస్తుంది. ప్రస్తుతం గాంధీలో 20 పడకలతో ఒక ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.

More in TG