సోషల్ మీడియా Vs కిడ్స్: కేంద్రానికి సుప్రీం నోటీసులు!

చిన్న పిల్లలు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వాడటంపై సుప్రీంకోర్టు ఇంపార్టెంట్ కామెంట్స్ చేసింది. పిల్లలకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఈజీగా అందుబాటులో ఉంటున్నాయని, అందుకే వారి సేఫ్టీ కోసం కచ్చితంగా పరిమితులు, హద్దులు ఉండాలని స్పష్టం చేసింది. మైనర్లను ఆన్‌లైన్ వేధింపుల నుంచి ప్రొటెక్ట్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది. చిన్నారుల రక్షణ కోసం ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారో క్లారిటీ ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.


