సుప్రీం వార్నింగ్.. దిగొచ్చిన UP అధికారులు!

NEET-UG పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న స్టూడెంట్స్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదని స్పష్టమైన ఆర్డర్ ఉన్నప్పటికీ, గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ స్టూడెంట్ అక్షత్ త్రిపాఠికి షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై సుప్రీం సీరియస్ అయ్యింది. "ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ" స్టూడెంట్ నుంచి ₹5 లక్షల బాండ్ డిమాండ్ చేయడంపై CJI సూర్యాకాంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై సదరు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని ఆదేశించారు. విమర్శల తీవ్రతతో అధికారులు ఈ నోటీస్‌ను ఇప్పటికే విత్‌డ్రా చేసుకున్నారు.


