100 కోసం పసికందు ప్రాణం తీశాడు

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఓ తండ్రి తన ఐదు నెలల కుమారుడిని గొంతు నులిమి చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య మద్యం కోసం ₹100 ఇవ్వలేదనే కోపంతో తండ్రి చందు ఇలా చేశాడు. లోకల్ హోటల్లో వర్క్ చేసే భార్య దగ్గరికి బాబును తీసుకెళ్లిన అతడు, డబ్బులు ఇవ్వడానికి ఆమె నిరాకరించడంతో చిన్నారిని ఇంటికి తీసుకొచ్చాడు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి బాబు గొంతు నులిమి హత్య చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఇన్సిడెంట్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


