డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు: లోకేష్

AP: రాష్ట్రంలోని 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆళ్లగడ్డ డిగ్రీ కాలేజీకి భవన నిర్మాణంతోపాటు అవసరమైన వసతులు, సిబ్బంది కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రం లోని 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని, కడప లైబ్రరీని తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, శిక్షణ కేంద్రం, తెలుగు సాంస్కృతిక కేంద్రాన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని, త్వరలో డిజైన్ ఖరారు చేస్తామన్నారు.



