ప్రియాంక కేసులో పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

AP: మెడికో ప్రియాంక ఘటనపై డిప్యూటీ CM పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్ DIGతో ఫోన్‌లో మాట్లాడి ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ నెల 3న రాజమండ్రిలో సినిమా థియేటర్ వద్ద ప్రియాంక, ఆమె స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఇద్దరు యువకులు కారుతో బైక్‌ను <a href="https://www.theclearcutnews.com/n/BNi4iQK">ఢీకొట్టారు</a>. అనంతరం మరోసారి ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.



