హైదరాబాద్ పాత మెట్ల బావులకు కొత్త లుక్!

TG: హైదరాబాద్‌లో చాలామందికి తెలియని పాత మెట్ల బావులకు కొత్త లుక్ ఇవ్వనున్నారు. డిసెంబర్ 1 నుంచి ‘Baoli Art Sangam’ పేరుతో ఇండియాలోనే ఫస్ట్ స్టెప్‌వెల్ ఆర్ట్ బియన్నాలే జరగనుంది. జనవరి 2027 వరకు జరిగే ఈ ఈవెంట్‌లో 13 హెరిటేజ్ ప్లేస్‌లలో 200 మందికి పైగా ఆర్టిస్టులు పాల్గొంటారు. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 600 పాత మెట్ల బావులను గుర్తించారు. వీటిని రిపేర్ చేయడంతో పాటు వర్షపు నీటిని స్టోర్ చేసి, భూగర్భ జలాలను పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.


