ధ్రువ్ రాఠీకి దాడి బెదిరింపులు
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై దాడి చేస్తానంటూ గౌరవ్ హిందూ అనే వ్యక్తి బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధ్రువ్ మరోసారి పోలీసులపై విమర్శలు చేస్తే, తాను చావగొడతానని పబ్లిక్ గానే బెదిరించాడు. తాజాగా అతను పోలీసుల <a href="https://www.theclearcutnews.com/n/cGLdTTo">కాళ్లు మొక్కి ఆశీర్వాదం</a> తీసుకుంటున్న వీడియో తెరపైకి వచ్చింది. అతను తరచూ ప్రొటెస్టర్లపై దాడులు కూడా చేస్తున్నాడు. పోలీసులే ఇలా అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారనీ, పోలీసుల అండతో రెచ్చిపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి.



